88929 25504
 
  • Total Visitors: 3750715
  • Unique Visitors: 309659
  • Registered Users: 35961

Error message

  • Notice: Trying to access array offset on value of type int in element_children() (line 6569 of /home4/devan1ay/public_html/includes/common.inc).

  • Deprecated function: implode(): Passing glue string after array is deprecated. Swap the parameters in drupal_get_feeds() (line 394 of /home4/devan1ay/public_html/includes/common.inc).

లీడర్ పై 'వీవర్' గెలుపు...

ధన్యవాదాలు : శ్రీ తూతిక శ్రీనివాస విశ్వనాధ్

లీడర్ పై 'వీవర్' గెలుపు... ఇది మంగళగిరి చేనేత సత్యాగ్రహం సారాంశం
వీవెర్స్ యునైటెడ్ ఫ్రంట్ విజ్ఞప్తి మేరకు పద్మశాలి గర్జన పేరును 'చేనేత గర్జన' పేరు మార్పుకు సహకరించిన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్జతలు..

లీడర్ పై 'వీవర్' గెలిచాడు.. నిజమే.. చేనేతకు ప్రపంచ ఖ్యాతిగాంచిన మంగళగిరి కేంద్రంగా చేనేత కులాల మధ్య చిచ్చు పెట్టి రక్తసంబధీకులైన దేవాంగ, పద్మశాలి, కర్ణభక్త, పట్టుశాలి, తొగటశాలి, తొగటవీర క్షేత్రీయ, కలికాలభక్తులు, సేనాపతులు తదితర చేనేత కులాలను నిట్టనిలువుగా చీల్చాలన్న నాయకుల పాచికలు పారలేదు. చేనేత కులాల మధ్య వున్నా ఆచార వ్యవహారాలవలన సంబంధాలు, వనసమారాధనలు తదితర కుల సంస్కృతులు జరుగుతున్నా, ఉమ్మడి లక్ష్యం కోసం యుగాలుగా చేనేత కులాలు ఐక్యతను ప్రదర్శించి పోరాటాలు చేసిన సందర్భాలు చరిత్రలో ఉన్నాయి తప్ప, ఇలా చేనేత సత్యాగ్రహాలు పేరుమీద కుల గర్జనలు చేసిన దాఖలాలు లేవు. రాజకీయ స్వార్థమో, వ్యక్తి ప్రయోజనాలకోసమో , మిగిలిన చేనేత కులాలను సంప్రదించకుండా, కనీసం మాటవరసకు సమాచారం ఇవ్వకుండా, చేనేతకు తామే ప్రతినిధులమని భావించి కేవలం సంవత్సరన్న కాలం వయసున్నపద్మశాలి సాధికార సంస్థ ఏకపక్ష నిర్ణయంతో పద్మశాలి గర్జన లక్ష్యం లేని శ్రీకారం చుట్టారు . చేనేత మీద ఎటువంటి అవగాహనా లేదని మీడియా ముందు ఒప్పుకున్నా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు   విదేశీ పర్యటనలో నిమగ్నమవ్వగా, మంగళగిరిలో కుల గర్జన ఏర్పాట్లు చక చకా జరుగుతూ వచ్చ్చాయి. . మంగళగిరిలో జరుగు పరిణామాలను ఎప్పటికప్పుడు చేనేత   మిత్రులు సమాచారం అందించడం, జరుగుతున్నా పరిణామాలవలన నేతవర్గాలలో అనైక్యత ఏర్పడవచ్చు అని ముందుగా పసిగట్టిన వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ తమ చేనేత వ్యూహం ఉపయోగించి ఆంధ్ర, రాయలసీమ చేనేత కులాల ప్రతినిధులను సంప్రదించి జరగబోతున్న కుట్రను వివిధ మాద్యలద్వారా చేరవేసి చేనేత కుల బాంధవ్యులను అప్రమత్తం చేసింది. మీడియా వారి సహకారంతో మరీముఖ్యంగా సోషల్ మీడియా లో జరుగుతున్నా అన్యాయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. కనీసం స్వంత కులంలో పెద్దలను, నాయకులను సంప్రదించకుండా చేస్తున్న ఏర్పాట్లపై స్వంత వర్గంలోనే వ్యతిరేకత రావడంతో ముఖ్యంగా జరుగుతున్నా పరిణామాలపై జనసేన పార్టీ కూడా తమ అయిష్టాన్నీప్రదర్శించడంతో పద్మశాలి సాధికార సంస్థ పెద్దలు జరిగిన తప్పు తెలుసుకొని తమదైన శైలిలో సంప్రదింపులు జరపడం మొదలు పెట్టారు. పద్మశాలి గర్జన ఒక రోజు ముందు ప్రాంగణానికి కొన్ని మార్పులు చేసారు. సభను విజయవంతం చెయ్యడానికి పద్మశాలి సాధికారత సంస్థకు వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ద్వారా గత కొన్ని రోజులుగా   చేసిన సూచనలను కూడా పరిగణలోకి తీసుకోకుండా, చేనేత కుల పెద్దలను సంప్రదించకుండా, అన్ని చేనేత కులాలకు సమాన వేదిక అవకాశాలకు ఇవ్వకుండా, ముందుగానే ఒక అపెక్స్ కమిటీ ఏర్పాటు చేసి చేనేత సమస్యలు చర్చించకుండా కనీసం పవన్ కళ్యాణ్ గారు వచ్ఛే సభకు ఒక లక్ష్యం లేకుండా చక్కగా జరగవలిసిన సభను స్వీయ తప్పిదాలవలన విఫలం చేసారు. అందిన సమాచారం మేరకు నిర్వాహకులు సుమారు లక్షల్లో వస్తారని ప్రగల్భాలు పలికితే మంగళగిరిలో స్థానికంగా అధికంగా ఉంటే పద్మశాలి సోదరులు కూడా సభలో భాగస్వాయం కాలేదంటే సభ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయంపై ఎంత వ్యతిరేకత ఉందొ అర్ధమవుతుంది. చేనేత రాజకీయ ప్రతినిధులు, చేనేత నాయకులు, చేనేత రంగ నిపుణులు, ఇలా చెప్పుకుపోతే చేనేత సభకు చేనేత కార్మికులు రాకపోవడం అది ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానుల సభగా మారడం చాల విచారకరం. ఏది ఏమైనా సమాజానికి ఈ చేనేత వర్గం మంచి సందేశం పంపించి, రాజకీయ వర్గాలకు ఒక సవాల్ విసిరింది.. యుగయుగాలుగా చేనేత కార్మికులు కలిసే వున్నారు.. ఇక ముందు కూడా కలిసే ఉంటారని. విడిపోతే పడిపోతామని తెలుసుకున్న సగటు చేనేత కార్మికుడు కోట్లు ఖర్చుపెట్టిన మంగళగిరి చేనేత సభకు 'రామ్ రామ్' పలికెడు. లీడర్ పై 'వీవర్' గెలిచే స్థాయికి ఎదిగాడు.

పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదములు

చేనేత సత్యాగ్రహం అనే ముసుగులో మంగళగిరిలో జరిగేది పద్మశాలి కుల గర్జన అని దానికి చేనేత కులాలకు సంబంధం లేదని వీవెర్స్ యునైటెడ్ ఫ్రంట్ తమ వాదాన్ని గట్టిగ వినిపించింది. ఈ కుల గర్జన ద్వారా చేనేత కులాల ఐక్యతకు ప్రమాదముందని, ఇలా ఎవరికి వారు కులాల వారీగా గర్జనలు పెట్టుకుపోతే సంఖ్యాబలం తక్కువున్నా చేనేత కులాల వారి ఉనికి ప్రశ్నర్ధకం అవుతుందని స్వరం పెంచి ఎక్కడ రాజి పడకుండా చెప్పింది. చేనేత కులాలను అస్థిర పరిచే ఎటువంటి చర్యలను వీవెర్స్ యునైటెడ్ ఫ్రంట్ చూస్తూ ఊరుకోదని చెప్పింది. జరిగిన పొరపాట్లను సరిచేసి అందరం కలిసి సభను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చింది. కానీ స్వార్ధ ప్రయోజనాల వ్యూహం బెడిసికొట్టడంతో జనసేన ప్రతినిధులు రంగంలోకి దిగి, వీవెర్స్ యునైటెడ్ ఫ్రంట్ ప్రతినిధులతో సంభాషించి పద్మశాలి గర్జన అను పేరును తొలగించి చేనేత గర్జన పేరుగా సభను ఏర్పాటు చెయ్యడం జరిగింది. మా చేనేత  కులాల ఆత్మాభిమాన్నాయి అర్ధం చేసుకొని పేరు మార్పిడికి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, జనసేన ప్రతినిధులు మహేష్ రెడ్డిగారికి మాకు సహకరించిన జనసేన అభిమానులు అర్జున్ గారికి, నగేష్ గారికి, కళ్యాణ్ గారికి, ముఖ్యంగా పద్మశాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కోటేశ్వర రావు గారికి, పూజ్యులు శ్రీ శీరం శ్రీరామ చంద్ర మూర్తి గారికి, కోట వీరయ్యగారికి, కాలెపు సత్యనారాయణ గారు, అప్పాజీ గారు, చిన వెంకటరాయుడు గారు, రామకృష్ణ గారు, సంజీవ రావు గారు, ప్రకాష్ గారు, పొన్నగంటి సత్యనారాయణ గారికి  రాయలసీమ జిల్లాల చేనేత ప్రతినిధులు, ఆంధ్ర చేనేత ప్రతినిధులు ముఖ్యంగా సహకరించిన ఎలక్ట్రానిక్ & ప్రింట్ మీడియా వారికీ, పేరును రహస్యంగా వుంచమని చెప్పిన నా మిత్రుడకు, మరి ముఖ్యంగా నాకు వ్యక్తిగతంగా ఆప్తులు మా సమాచారాన్ని ఎప్పటికప్పుడు వ్యూహంలో భాగంగా చేరవలిసిన వారికీ చేరేటట్లు చేసిన హేమ కుమార్ కు చేస్తున్న కార్యక్రమానికి పవిత్ర లక్యం ఉందని గ్రహించి వెన్ను దన్నుగా వున్నా ఆంధ్రప్రదేశ్ లో వున్నా అన్ని చేనేత కులాల భాంధవ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు. మీ అందరి సహకారంతో రానున్న రోజుల్లో ఇదే ఐక్యత ప్రదర్శిద్దామని, ఎన్ని కుట్రలు పన్నిన చేనేత కులాల మధ్య ఐక్యత పెరగడమే తప్ప తరగదని మంగళగిరి సభద్వారా మీరు ప్రపంచానికి ఇచ్చిన సందేశం చరిత్రాత్మకం.

"లీడర్ కన్నా వీవర్ మిన్న" చేనేత కులాల ఐక్యత వర్ధిల్లాలి, జై చేనేత జై చేనేత.. 

శ్రేయోభిలాషి,  తూతిక శ్రీనివాస విశ్వనాధ్, రాష్ట్ర కన్వీనర్, వీవెర్స్ యునైటెడ్ ఫ్రంట్, 7675924666

Categories: 
Share Share
Scroll to Top