88929 25504
 
  • Total Visitors: 3745113
  • Unique Visitors: 308121
  • Registered Users: 35949

Error message

  • Notice: Trying to access array offset on value of type int in element_children() (line 6569 of /home4/devan1ay/public_html/includes/common.inc).

  • Deprecated function: implode(): Passing glue string after array is deprecated. Swap the parameters in drupal_get_feeds() (line 394 of /home4/devan1ay/public_html/includes/common.inc).

రాజమండ్రి  చేనేత మీటింగ

రాజమండ్రి, ఫిబ్రవరి 5: చేనేత సమస్యలను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి హెచ్‌కె మునియప్ప చెప్పారు. ఆదివారం రాజమండ్రిలో అఖిలభారత దేవాంగ మహాసభల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చేనేత కార్మికులు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. తాను కూడా ఇదే వృత్తిలో పనిచేశానని, ఈ వృత్తిలోని కష్టనష్టాలు తనకు బాగా తెలుసునన్నారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలతో ఒక ప్రతినిధి బృందం ఢిల్లీవస్తే యుపిఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, కేంద్ర టెక్స్‌టైల్స్‌శాఖమంత్రి ఆనందశర్మ వద్దకు తీసుకెళతానన్నారు.
అఖిల భారత దేవాంగ మహాసభలో చేసిన తీర్మానాలతో ప్రతినిధి బృందం రావాలని మునియప్ప సూచించారు. ప్రజలకు అన్నం పెట్టేందుకు రైతులు కృషిచేస్తుంటే, ప్రజల మర్యాదను కాపాడటానికి దేవాంగులు కృషిచేస్తున్నారన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో కూడా దేవాంగులు ఆత్మ బలిదానాలు చేశారని, మహాత్మాగాంధీ చేసిన సత్యాగ్రహాలు, స్వాతంత్య్ర పోరాటాల్లో దేవాంగులు కీలకపాత్రను పోషించారన్నారు. అందువల్లే జాతీయ జెండాలో చరఖాను ఉంచారన్నారు. భూమిమీద సూర్య, చంద్రులు ఉన్నంత వరకు దేవాంగుల త్యాగం జాతీయ జెండాలో నిలిచే ఉంటుందన్నారు. అలాంటి దేవాంగులకు చేనేతలో ఇపుడు కనీస వేతనం కూడా లభించటం లేదన్నారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న దేవాంగ సంఘానికి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులను కలుపుకెళ్లి, చేనేత కార్మికుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి కృషిచేస్తామన్నారు. మార్చిలో పార్లమెంటు సమావేశాలు జరిగే సమయంలో ప్రతినిధి బృందం ఢిల్లీ రావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరతామన్నారు. ఎంపి నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ వ్యవసాయ కూలీల కన్నా తక్కువ వేతనం పొందుతున్న చేనేత కార్మికులకు ఉపాధి హామీ పథకాన్ని అమలుచేయాలని, రుణమాఫీ పథకం కింద నిధులు విడుదలచేయాలని కోరారు. ప్రజలకు బట్టలిచ్చి గౌరవం నిలపుతున్న చేనేత కార్మికులకు తిండి, బట్టలు లేని పరిస్థితి దాపురించిందని, దాని నుండి రక్షించాలని కోరారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. సభకు అధ్యక్షవహించిన బొమ్మన రాజ్‌కుమార్ చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
ఈ సభలో స్థానిక ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, ఎమ్మెల్యే చందన రమేష్, దయానందపురి స్వామీజీ, కర్రి బసవేశ్వరస్వామీజీ, హెచ్‌కె గోవిందప్ప, కాలెపు సత్యనారాయణ, బొడ్డు వేణుగోపాలరావు, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దేవాంగ నాయకులు పాల్గొన్నారు.

(చిత్రం) అఖిల భారత దేవాంగ మహాసభల్లో మాట్లాడుతున్న కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మునియప్ప.

Courtesy : http://archive.andhrabhoomi.net/content/cheneta-samasyalu

Image: 
Categories: 
Share Share
Scroll to Top